ఈ పుట ఆమోదించబడ్డది

యోగాసనములు

169


కుడు సమాధి స్తితికి చేరువగా చేరుకొనును. కేవలము మనస్సును దీని యందు నియమించ కుండ నిర్లిప్తము చేయుట దుస్సాద్యము. మనసు కళ్ళెము లేని గుఱ్ఱముల వంటిది. అందు వలన ప్రాణాయామము అభ్యసించి కేవల కుంభకము అలవరచు కొన వలయును. ఈ విషయమును గ్రహించక సాధన చేసిన కేవలము ప్రయాస మాత్రము మిగులును.

షణ్ముఖి ముద్ర

సుఖముగా వెన్నును, మెడను శిరస్సును తిన్నగా వుంచి శ్వాసను బాగుగా పూరించి రెండు చేతుల బొటన వ్రేళ్ళతొ రెండు చెవుల రంద్రములను, రెండు చూపుడు వ్రేళ్ళతోను మూయబడిన కండ్ల పై ఉంచి రెండు చేతుల నడిమి వ్రేళ్ళతోను రెండు నాసికా రంధ్రములను మూసి ఉంగరపు వ్రేళ్ళను పై పెదవి మీదను, చిటికెన వ్రేళ్ళను క్రింది పెదవి అంతను ఉంచి రెండు వ్రేళ్ళతోను రెండు పెదవులను అదిమి పెట్టి నిశ్చలముగా కూర్చున్న ఎడల శరీరములో ఒక విధమైన నాదము వినబడును. దానినే అనాహత చక్రము (హృదస్యము) నుండి వచ్చు శబ్దముగా గుర్తించిరి. అది మొదట ఓంకారముగా తెలియబడి ప్రాణాయామము వలన, నాడీ శుద్ధి జరుగు సమయమున దశ విధములగు నాధములుగ వినబడును. కొంత అభ్యాసము జరిపిన పిమ్మట అట్టి నాదమును చెవులు మిగిలిన రంధ్రములు మూయకనే వినబడును. ఇట్టి నాదము నందు మనస్సు లగ్నము చేసిన యడల మనసులయమగును. నాదమును మనసును లయ పరచుటయే లయ యోగమని చెప్పబడెను.

21)