14
మిది అంగముల కల్గి అష్టాంగ యోగముగా వెలువడినది, యోగాభ్యాసమునకు ప్రారంభమునుండి సాధకుడు బాహ్యము లైనట్టియు, అంతరము లైనట్టియు కొన్ని నియమములను అలవరచు కొనవలయును. యమ నియమములే అట్టికట్టు బాట్లు.
యమము అనగా అహింస, సత్యమునే పల్కుట, దొంగ తనము చేయ కుండుట, బ్రహ్మ చర్యము పాటించుట ఓరిమి కల్గి యుండుట, మనస్సు బాధ పడినపుడు చలింప కుండుట, దయ కల్గి యుండుట, ఋజు ప్రవర్థనము కలిగి యుండుట, మితముగ భుజించుట, పరిశుభ్రముగా ఉండుట, అను పది అంశములు.
నియమ మనగా తపస్సు, సంతోషము, ఆస్తిక్యత, దానము, భగవంతుని పూజించుట, భగవంతుని గూర్చిన సిద్ధాంతములను వినుట, ధర్మ విరుద్దములను కర్మలను ఆచరించుటయందు సిగ్గును పొందుట, సద్భుద్ది, జపము, వ్రతము అను పది అంశములు.
ఇట్టి యా నియమములు ముందుగా అభ్యశింపక యోగాభ్యాసమును ప్రారం భించు వారు పునాది బలము లేకయే (పెద్ద భనములు) హర్మ్యమును నిర్మించిన అది అనతి కాలములోనే నేల కూలినట్లు భంగ పడవలసి వచ్చును. చాల తపస్సుచేసి గొప్ప శక్తులను సంపాదించియు పైన చెప్పిన నీతి నియమములు లేక భగపడిన ఉదంతములు భారతీయ పురాణ, యితిహాసముల యందు లెక్కకు మిక్కుటముగా కాన వచ్చును. పై విషయములలోని యమము నందలి మితాహారమును గూర్చి వివరించుట చాల అవసరము. యోగ సాధకులు యోగా