ఈ పుట ఆమోదించబడ్డది

166

లంక సూర్యనారయణ


1.సరస్వతీ చాలనము

సూక్ష్మ నాడీ మండల కేంద్రమగు కంద స్థానమునుండి 72,000 డెబ్బది రెండు వేల యోగ నాడులు శరీర మంతటను ప్రసరించి యున్నవి. ఆ కందమున స్థానముగా చేసికొని సుషుమ్నా మార్గమున తలనిడి నిద్రావస్థలో నున్న శక్తిని మేల్కొలుపుటకు సరస్వతీ నాడిని చలింప చేయ వలయును. ఈ సరస్వతీ నాడినే ఆరుంధతీయని కూడ పిలువబడును.

చేతుల నాలుగు వ్రేళ్ళను, ఒక ప్రక్కను, బొటన వ్రేలిని మరియొక ప్రక్కను ఉంచుకొని, రెండు ప్రక్కలయందు రెండు చేతులు వుంచి నడుమును గట్టిగా అదిమి పట్టి, కుడి ప్రక్క నుండి ఎడమ ప్రక్కకు నడుమును తోము నట్లుగా చేతులతో తోమ వలయును. అట్లు చేయుట వలన సరస్వతీ నాడి ధ్వనితో కూడి చలించి కుండలిని మేల్కొల్పును. మేల్కొనిన కుండలిని ఊర్థ్వముగా పయనింప ప్రారంబించును. ప్రతి పర్యాయము ప్రాణాయామము చేయు గడంగుటకు ముందుగాచేయ వలయును. ప్రాణాయామానతరము చేయుట వలన ఫలిత ముండదు.

సరస్వతీ చాలనము కొరకు కుండల్లోపనిషత్తునందు మరియొక విధము చెప్పబడినది. సాధకుడు దృడముగా పద్మాసనమున కూర్చుండి, మొదట కుడి నాడి చేత 12 అంగుళముల పొడవు గల వాయువును లోనికి పీల్చి, తర్వాత మరి యింకను నాలుగు అంగుళముల ప్రాణవాయువును లోనికి విస్తరింప చేసి, కుండలినిని ఊర్ద్వ ముఖముగా ఆకర్షింప వలెను. అటుల కొంత సేపు కుడి నాడి చేతను, కొంత సేపు ఎదమ నాడి