ఈ పుట ఆమోదించబడ్డది

యోగాసనములు

159


అంత తేలిక పని కాదు. నాలుక క్రిందనున్న నరముల పట్టు సడల వలయును. మరియు నాలుక పొడవుగా సాగగల శక్తి పొంద వలయును. దాని కొరకు కొంత దోహద క్రియ చేయ వలయును. నాలుక ఆవుపాలు పిండునపుడు చనుకట్టూ పట్టుకొనునట్టుగా పట్టుకొని ఆ ప్రక్కకు, ఈ ప్రక్కకు, ముందునకు లాగుచు సాగ దీయ వలయును. మరియు వాడి యగు కత్తిని తీసుకొని నాలుక క్రింద దౌడను కలియు స్థానమూ ఒక వెంట్రుక వాసి ఛేదించ వలయును. ఆ చేదించ బడిన ప్రదేశమున వ్రణము కాక ఉండుటకు గాను కరక్కాయపొడిలో సైంధవలవణ చూర్ణమును చేర్చి అంటించ వలయును. అటుల ప్రతి వారము దినములకు ఒక పర్యాయము చేయ వలయును. అట్లు ఆరునెలల చేసిన జిహ్వను బంధించిన నరములు పట్లు విడిచి నాలుకను కపాల కుహరమును చేరు సామర్థ్యమును కల్గించు చున్నది. కపాల కుహరముమందు ఇడ, పింగళ, సుషుమ్న అను నాడులు కలియు చోటున "వ్యోమచక్రము" న ప్రవేశ పెట్టి అరక్షణము అనాగా 12 నిముషముల కాలము ఉంచ వలయును. ఇట్లు చేయుట వలన సాధకుడు చంద్ర స్థానము నుండి స్రవించు అమృతమును ఆస్వాదించి మృత్యువును జయించ గల్గునని ఋషుల చేత చెప్ప బడినది. దీనినే ఈ సందర్భముననే, గోమాంస భక్షణము, అమృత హరుణి సేవయు మానవుని పవిత్రము చేయునని చెప్పబడినది. ఈ వాక్యము నకు ఆవు మాంసము తిని, కల్లు త్రాగినయెడల మానవుడు పవిత్రమగునని బాహ్యముగ కనపట్టు చున్నది. గో శబ్ధమునకు కొండనాలుక యని అర్థము. గోమాంస బక్షణ అనగా