ఈ పుట ఆమోదించబడ్డది

13

13 త్రిలింగ స్వామియును తెలుగు స్వామి కాశీ పట్టణమున యోగ శాస్త్ర విషయములన్నియు సత్యములని నిరూపించినారు. సాధారణముగా ఈ విద్యను నిగూఢముగా ఉంచుటకు ప్రయత్నించ బడెను. కేవలము ఈ విద్య యొక్క పవిత్రతను పరి రక్షించుట కొరకు మాత్రమే రహస్యముగా ఉంచ బడెను. యోగ విద్యను అన్ని వర్ణముల వారును, స్త్రీలు గూడ అభ్యసించ వచ్చునని మతంగ మహర్షి చేత చెప్పబడెను.

  • ||అగ్నిష్టో మాదికాన్ స్ర్వాన్ విహయ ద్విజ సత్తమః
  • యోగాభ్యాస రతః శాంతః పరం బ్రహ్మ ధి గచ్చతి||
  • బ్రాహ్నణ క్షత్రియ విశాం స్త్రీశూద్రౌదాంచ పావనం|
  • సాంతయే కర్మణా మన్యద్దోగాన్నాస్తి విముక్తయే|| అని మరియు యువకులు, వృద్ధులు, రోగులు, ఏడు సంవత్సరముల పైబడిన బాలబాలికలు, స్త్రీ పురుషులు అభ్యసించ వచ్చునని శాస్త్రములు చెప్పినవి. యోగ విద్యకు మతము అడ్డురాదు. ఏ మతస్థులయినను యోగమును అభ్యసించ వచ్చును. యోగము సర్వ కాలములకు సర్వ మతములకు, సర్వ దేశములకు తుదకు నిరీశ్వర వాదులకు కూడ తగినదైనందున ఎల్లరు అభ్యశింప దగిన దనుట శాస్త్ర సమ్మతము. శాస్త్ర విహితమైన రీతిని సాధన చేసిన సత్పలితములను పొంద వచ్చును.

రాజ యోగము హఠ యోగమునకు మెట్టు వంటిది. హఠ యోగము యొక్క పరిణితి పొందిన దశయే రాజ యోగము. హఠ యోగమున యమ, నియమ, ఆసన, ప్రాణయామ, ప్రత్యాహారధారణ, ధ్యాన, సమాధి యని (8) ఎని