యోగాసనములు
155
నాలుకను దంత మూలములందు గట్టిగా అదిమి పట్టిన జిహ్వ బంధమనిరి.
- ఉడ్వాన బంధము
నాభికి చుట్టును వున్నఉదర భాగమును, వెన్నునకు అంటు నట్లు మీదికిని వెనుకకును లాగి వుంచునది ఉడ్డియాన బంధము. ఉడ్డి యాన మనగా పక్షి వలె ఎగురుట. గర్భ కోశమున బంధింపబడిన ప్రాణము సుషుమ్న నాడీ మార్గమున ఎగురునట్లు చేయునది. కావున ఉడ్డీ యానమనిరి. ప్రాణము ప్రాణము సుషుమ్నలో ప్రవేశించి సంచరించుటవలన యోగము యొక్క ఫలము అయిన సమాధిని త్వరిత గతిని పొంద వచ్చును. అందు చేత యోగులు దీనిని చాల ముఖ్యమైన దానినిగ పరిగణించిరి.
- మూల బంధము
నాభికి చుట్టును వున్న ఉదర భాగమూ, వెన్నునకు అంటు నట్లు మీదికిని వెనుకకును లాగి వుంచునది ఉడ్డియానబంధము. ఉడ్డి యాన మనగా పక్షివలె ఎగురుట. గర్భ కోశమున బంధింపబడిన ప్రాణము సుషుమ్న నాడీ మార్గమున ఎగురునట్లు చేయునది. కావున ఉడ్డీ యానమనిరి. ప్రాణము సుషుమ్నలో ప్రవేశించి సంచరించుట వలన యోగము యొక్క ఫహలము అయిన సమాధిని త్వరిత గతిని పొంద వచ్చును. అందు చేత యోగులు దీనిని చాల ముఖ్యమైన దానినిగ పరిగణించిరి.
- మూలబంధము
క్రిందికి పోవుటయే అపాన వాయువునకు ముఖ్య లక్షణము. బొడ్డు నుండి క్రింద నున్న వాయువును అపాన మందురు. మూలాధారమున (గుదము) గట్టిగా పీడించి సంకుచపరచి పైకి లాగి కొనిన, క్రిందికి పోవు చున్న ఆపాన వాయువు యొక్క గమనము నిరోధించ బడి ఊర్ద్వ గతి చెందును. అపుడు ఊర్ద్వమందున్న ప్రాణ వాయువుతో సంయోగమును పొందును. ప్రాణ ఆపాన వాయువుల సంయోగమే యోగమని చెప్పబడినది. ఇట్లు ప్రాణాపానములు సంయోగము పొందినపుడు శరీరములో యోగాగ్ని ప్రజ్వరిల్లి యోగ నాడి మండలమున వున్న మలములు శోషక, దాహక క్రియల చేత (అనగా కాల్చి వేయుట, ఆర బెట్టుట) శుద్ధి పొందును. సూక్ష్మ నాడి మండ