ఈ పుట ఆమోదించబడ్డది

చున్న అన్యామనును నివర్తించుటకు నేటికయినా మన ప్రభుత్వము పూనుకొన లేదు. వేదములను ఐదు వేల సంవాత్సరములకు పూర్వమున కృష్టద్వైపాయనుడను వ్వాస మహరషి సంకలనము చేసినారు. అంతకు ముందే అన్నడో నిర్ణయించ లేని కాలముననే వేదములుద్బవించినవి. వేదములను, మరి కొన్ని శాస్త్రములను సనాతన ఋషులు సమాధి స్తితి నుండి విని వాటిని కంఠస్తము చేసి కొంత కాలమునకు గ్రంధ రూపమున సంకలనము చేసినారు. ఓ భారతీయుడా నీ పూర్వులు చాల విజ్ఞాన వంతులు, శక్తి సంపన్నులు, అని తెలియ చేసినచో బానిస సంకెళ్ళను త్రెంచుకొని స్వతంత్రము, స్వేశ్చలను కోరుదురని విదేశీయులు అభిప్రాయపడి మన గొప్ప తెలుసుకొననీయని విద్యను మనకు గరపినారు. భావ స్వాతంత్ర్యమును కూడ మరచిన మనను వారికి అనుకూలమైన బానిసలుగా తయారు చేసి, కొందరిని ఎన్నుకొని వారికి బిరుదులను ప్రసాదించినారు. కాలము పస్రిపక్యమైనది. ఎన్నో ఇడుముల నడుమ ఎందస్రెందక్వ్రో ల్త్యాగధనులు తమ శరీరములను విదేశీ రక్కసుల తుపాకి గుండ్లకు బలి యెసగి ఎట్టకేలకు స్వాతంత్ర్యమును సముపార్జించినారు.

వేదములకు వలెనే యోగ శాస్త్రము కూడా అతి ప్రాచీనమయినది. దాని కాలమున కూడ నిర్ణయింప వీలు లేనిది. వేదముల యందు, ఉపనిషత్తుల యందు, మహా భారత మందలి భగవద్గీత యందు, యోగ శాస్త్రము వివరముగా చర్చింప బడినది. పతంజలి మహర్షి యోగ దర్శనమిఉను సూత్రీకరించి యోగ