ఈ పుట ఆమోదించబడ్డది

యోగాసనములు

101


నందున్న చంద్రస్థానము నుండి స్రవించిన అమృతము సూర్య స్థానము (అగ్ని) అయిన నాభి స్థానము పై పడుట వలన అమృతము అగ్ని బడి దగ్దమయి అమృత ప్రయోజనమును పొందలేక పోవు చున్నారు. అందుచేత అట్టి అమృతమును శరీరమందు నివియోగింప బడుటకు ఋషులు ఈ సూర్యచంద్ర స్థానములను విపరీతము చేసి చంద్రస్థానము క్రిందికిని సూర్య స్థానము మీదికి పెట్టి నట్లు ఈ ఆసనమును నిర్మించిరి. శరీరమునందు నిలిచిన అమృతము వలన సాధనకు శరీర మందలి సర్వాంగములు పోషింప బడు చున్నవి.

వెల్లికిల భూమిమీద వీపు ఆనించి పరుండి భుజముల దగ్గర నుండి శరీరమంతటిని భూమికి లంబముగా ఎత్తవలయును. ఇందు గడ్డము రొమ్మున గ్రుచ్చు కొనవలయునను నియమము తప్పక పాటించ వలయును. అప్పుడే ధయిరాయిడు గ్రంధులు బాగుగా పని చేయును. చేతులు, వీపునకు దన్ను పెట్ట వచ్చును. లేదా నేలపై వుంచవలయును.

ఉపయోగములు
శరీర మందలి అన్ని భాగములు దీని మూలమున చక్కగా పోషింప బడి రోగములను విడిచి అరోగ్యమును పొంది బలమును కూర్చు కొనును. ముసలి తనమును దూరముగా వుంచ వచ్చును.