ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ముందు పుటక
నాపక్క తిరిగి మాటాడవా ? యెంకి !
- యీ సిక్కు నీ విప్పగలవా?
- యీ జంట విడిపోయి
- యే వాడనో తేలి,
- యెంకి పాటినగానే
- యెదర నిలిసేదెవరో?
- నాసూపు
- సెదరగొట్టేదెవరో?
- నా తోవ
- సదును సేసేదెవరో?
- నాపక్క తిరిగి మాటాడవా? యెంకీ!
- యీ సిక్కు నీ విప్పగలవా?
- మన సేతితో నాటి
- మన సొంతమని పెంచి
- మనకోట యీతోట
- మరపు రాకుంటాదా?
- నాగుండె
- మరిగి పోకుంటాదా?
- నాపక్క తిరిగి మాటాడవా? యెంకీ!
- యీ సిక్కు నీ విప్పగలవా?30 యెంకి పాటలు