పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/7

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ర వఱకు 154 మెట్లున్నవి. గంగధార ననుసరించి కొండమీద హనుమద్ఘట్టము వరకు- కూర్మధార- గోదావరీధార- ఆకాశధార- యనునట్టి నామములు గల యనేక ధారలున్నవి. దేవళము బహు సుందరముగా నున్నది. శ్రీకృష్ణదేవరాయలు మొదలైన పుర్వరాజులు చేసిన శాసనములు స్తంభములపై వ్రాయబడియున్నవి. ఆ దేవళమందు శ్రీ వరాహనరసింహ స్వామివారు స్వయం వ్యక్తముగా వేంచేసి యుండగా- ప్రహ్లాదుడు ప్రధమారాధన మొనరించినందున ప్రహ్లాద ప్రతిష్ఠ యందురు.

శ్లోకము.

వ్రాహీతి వ్యాహరంతం త్రిదశరిపుసుతం గ్రాతు కామోరహస్యే |
విస్రప్తం పీతవస్త్ర--క్రట్సికటే సవ్యహస్తేన గృహ్ణన్ ||
వేగశ్రాన్తం నితాప్త శిలాం మమృతం పాయయేన్నత్యపాణౌ |
సింహాద్రౌ శీఘ్రపాత క్షితి వేహితపసః పాతుమాం నారసింహా ||

అని యీ చొప్పున స్వామివారిని ధ్యానింతురు. అక్షయతృతీయనాడు చందనము విచ్చి యభిషేకింతురు. గనుక నాడు మాత్రము నిజరూప దర్శనమగును. ఆ పైన ప్రతిదినము సంవత్సరము వరకు చందనము పూయుదురు. గావున స్వామి రొమ్ము పొడవుగా పుల్లగుమ్మడిపండు వలె యుండును. ముందు విచ్చిన చందనపు పెచ్చులు ప్రసాదముగా నిచ్చుచుందురు. దినము 1కి ఖ1/1 బియ్యము వండి త్రికాలారాధనము చేయుచున్నారు. అందులోబాల భోగమునకు ఖ 1/1 రాజభోగమునకు ఖ 1 రాత్రి భోగము 0 1 0 వినియోగమగును. కొండమీదను, అడివారమనెడు దిగువ తిరుపతిలోను పెక్కండ్రు వైష్ణవులున్నారు. సువాసనగల గులాబీ జాతులనేకముగా గలవు. కొండమీద మున్నాగువారా పువ్వుల చెట్లు, కరివేప చెట్లు, అనాసపనాస చెట్లు బడ్డుముడి మొదలైనవి పెరుగుచున్నవి. యిక్కొండమీదనే తూర్పుగా 4 మైళ్లలో