ఈ పుట ఆమోదించబడ్డది

76

స్మృతికాలపుస్త్రీలు

భర్త మృతుడైననుగూడ నామె తదేకలగ్న మనస్కయై యాతనియం దచంచలభక్తిగలదై మనో వాక్కాయములచే పవిత్రురాలుగ నుండవలెను. ఏలన దాంపత్యము కేవల మీజన్మతోనే యంతరించునది కాదు (ఈయంశము 'పునర్వివాహ'మను నధ్యాయమున వివరింపబడును.)

పతిసేవయే పరమధర్మముగ గల స్త్రీకి 'సాధ్వి' యను నామము వాడబడుటచేతనే స్త్రీకి పతిసేవకంటె నెక్కుడు సాధు (మంచి) గుణములేదని తెలియుచున్నది. అట్లే యట్టి స్త్రీకి సతి (యోగ్యురాలు) అను నామముగూడ గలదు.

    పతింయానాభి చరతిమనోవాగ్దేహ సంయతా
    సాభర్తృలోక మాప్నోతి నద్భిస్సాధ్వీ తిచోచ్యతే
(మను 5-165)

(ఏ స్త్రీ మనోవాక్కాయ నియమముకలదై భర్త నతిక్రమింపకుండునో యామె భర్తృలోకము నొందును; సత్పురుషులచే సాధ్వియని చెప్పబడును.)

ఇది స్త్రీల కవశ్యముండవలసిన ధర్మము. దీనివలన నైహికాముష్మిక లాభమెంతయో కలదు.

    అనేననారీవృత్తేన మనోవాగ్దేహ సంయతా
    ఇహాగ్య్రాం కీర్తిమాప్నోతి పతిలోకం వరత్రచ

(మను. 5-166)