ఈ పుట ఆమోదించబడ్డది

64

స్మృతికాలపుస్త్రీలు

ఇట్టి వాగ్దానమునకును వివాహమునకును నడుమ నెంతకాలము గడచినను నాకన్యావరు లిద్దఱు నించుమించుగ దంపతులేయని చెప్పవచ్చును. వారి సంబంధములో దాంపత్యాంశ మెంత హెచ్చుగనున్న దనగాః ఆస్థితిలో కన్య మరణించుచో వరుని జ్ఞాతులకశౌచముండును.

     స్త్రీణామ సంస్కృతానాంతుత్య్ర హాచ్ఛుద్ధ్యంతిబాంధవాః
     యధోక్తై నైవకల్పేన శుద్ధ్యంతి తుననాభయః.
(మను. 5-72)

(వివాహముకాని స్త్రీలు మరణించుచో, ననగా వాగ్దత్తలు మరణించుచో, భర్తృజ్ఞాతులు మూడుదినము లాశౌచము పట్టవలెను. ఆమెతండ్రి దాయాదులన్ననో, యిదివఱలో చెప్పిన వివాహిత విషయములోవలెనే, మూడునాళ్లా శౌచము పట్టవలెను.)

దీనివలన వాగ్దాన ప్రాబల్యము స్పష్టమగుచున్నది. వాగ్దత్త భార్యయన్నట్లేకాని కేవలము భార్యకాదని దీనివలన తెలియుచున్నది. జ్ఞాతులకున్నట్లు దశరాత్రాశౌచము విధింపబడలేదు. ఏసంబంధమును లేనివారికివలె నాశౌచము లేకుండగను లేదు. కాన వాగ్దత్తా భార్యవంటిదే కాని భార్య కాదనిచెప్పుట యుక్తముగనుండును. అనగా నామె పత్నీ భిన్నయేకాని పత్నీసదృశ. అట్లే వాగ్దానపతికూడ పతిభిన్న పతి సదృశుడగుచున్నాడు. 'నఞ'కు తద్భిన్నతత్సదృశత్వ