పుట:Womeninthesmrtis026349mbp.pdf/226

ఈ పుట ఆమోదించబడ్డది

206

స్మృతికాలపుస్త్రీలు

ఏ హేతువుచేతనైన రజస్వలనుస్పృశించుచో స్నానము చేశుద్ధిగల్గును.

    దివాకర్తిముదక్యాంచ పతితంసూతికంతథా
    శసంతత్స్సృష్టినం చైవస్సృష్ట్వాస్నా నేనశుద్ధ్యతి.
(మను. 4-219)

రజస్వల లొకరినొకరు గూడ స్పృశింపరాదు.

    స్పృష్ట్వారజస్వలా న్యోన్యం బ్రాహ్మణీబ్రాహ్మణీంతధా
    తాపత్తిష్ఠీన్ని రాహారా త్రిరాత్రేణైవశుద్థ్యతి
(పరాశర. 7-14)

(బ్రాహ్మణ రజస్వల లొండొరుల స్పృశించుచో మూడునాళ్లుపవసించిన శుద్ధియగును.

రజఃకాలము మూడు దినములును నొకేవిధమగు నపరిశుద్ధత స్త్రీకుండదు. ఆమూడుదినములలోను నపరిశుద్ధత క్రమముగ నొకనాటికంటె నొకనాడు తగ్గుచుండును.

    ప్రథమేహని చండాలీ ద్వితీయే బ్రహ్మఘాతినీ
    తృతీయేరజకీ ప్రోక్తాచతుర్థేహనిశుద్ధ్యతి

(రజస్వల మొదటినాడు చండాలి. రెండవనాడు బ్రహ్మ ఘాతిని. మూడవనాడు చాకలిది. నాల్గవనాడు శుద్ధురాలగును.)

రజస్వల నాల్గవనాడు శుద్ధినొందును కాని రజస్స్రావమా నాటికి నిలిచిపోనిచో నామె భర్తచేయు దైవపిత్య్రాది కర్మలలో పాల్గొనుటకు వీలులేదు. రజస్సు నిలిచిపోయిన పిమ్మటనే దైవపిత్య్రాది కర్మలను చేసికొనవలెను.