ఈ పుట ఆమోదించబడ్డది

హారితుడు క్రీ.శ. 400 కును 700 కును నడుమ. పరాశరుడు క్రీ.శ. 1200. పరాశరస్మృతికి పిమ్మట పుట్టిన ధర్మశాస్త్ర గ్రంథములన్నియు వ్యాఖ్యానములో నిబంధన గ్రంథములో యైయున్నవి.

మొత్తముపై స్మృతులలో నాయాకాలముల నాటి స్త్రీలపరిస్థితులు ప్రతిబింబింపబడినవని చెప్పవచ్చును గాని యందు గన్పట్టు స్త్రీవిషయకవిధి నిషేధవాక్యములన్నియు పూర్తిగా పాటింపబడుచుండెనని చెప్పుటకు వీలులేదు. కాన స్మృతు లాయాకాలముల నాటి స్త్రీ విషయకములగు నాదర్శములను క్రోడీకరించుచున్నవని కూడ చెప్పవలెను. ఈ స్థితులును నాధర్మములును గూడ నీ గ్రంథములో వివరింపబడినవి కాన చారిత్రకదృష్టి కలవారికిని నదిలేక కేవలము స్మృతులలోని ధర్మముల నా చరణలో పెట్టవలెనని కోరువారికిని గూడ నీ గ్రంథముపయోగించును.

నే నీగ్రంథములో నేమి చెప్పిననుగూడ నందుల కాధారములగు స్మృతివాక్యములనట నిచ్చియున్నాను. ఆ వాక్యముల స్థలనిర్దేశమును గూడ చేసి వాని యర్థములను గూడ నిచ్చియున్నాను. నాకు గలస్త్రీ విషయకాభిప్రాయములను స్మృతివాక్యములలోనికి చొప్పించుటకు నే నెచటను యత్నిం