పుట:Womeninthesmrtis026349mbp.pdf/148

ఈ పుట ఆమోదించబడ్డది

130

స్మృతికాలపుస్త్రీలు

కర్మలో స్త్రీ కెంత ప్రాధాన్యమున్నదన నాధానము చేసినవాని జ్యేష్ఠభార్య భ్రష్టురాలగుచో నామెభర్త మరల నాధానము చేసికొనవలెను.

    జ్యేష్ఠాచేద్బహుభార్య స్యాతిచారేణగచ్ఛతి
    పునరాధానమత్రైకఇచ్చన్తి నతుగోతమః
(కాత్యాయన. 20-4)

(బహుభార్యలుగలవాని ప్రథమభార్య చెడిపోవుచో నాతడు మఱల నాధానము చేయవలెనని కొందఱు చెప్పుచున్నారు. చేయనక్కరలేదని గౌతముడు చెప్పుచున్నాడు.)

జ్యేష్ఠభార్యకు మిగిలినభార్యలకంటె కర్మాధిక్యమెచట నంగీకరింపబడినదన: తనకంటె ముందుగ జ్యేష్ఠభార్య చనిపోవుచో నాహితాగ్ని యామెను వైతానికాగ్నులచే దహనము చేయవలెను. జ్యేష్ఠ భార్యయుండగా రెండవభార్య చనిపోవుచో నామెను వైతానికాగ్నులచే దహింపరాదు.

    "దాహయిత్వాగ్నిభిర్భార్యాం సదృశీం పూర్వమారిణీం
    పాత్రైశ్చాగ్నిమాదధ్యాత్ కృతదారో విలంబితః
    ద్వితీయాంచైవయః పత్నీందహేద్వైతాని కాగ్నిభిః
    జీవన్త్యాం ప్రథమాయాంతు బ్రహ్మఘ్నేననమం హితత్.
(కాత్యాయన. 20-5, 7)

(ముందు చనిపోయిన సవర్ణభార్య నగ్నులతోడను పాత్రలతోడను దహింపజేసి యాలసింపక మఱొకభార్యను