వికీసోర్స్
వికీసోర్స్ అంటే ఉచిత అంతర్జాల డిజిటల్ గ్రంథాలయం. దీనిని కూడా వికీమీడియా ఫౌండేషనే నిర్వహిస్తోంది. స్వచ్ఛంద సేవకులు కాపీహక్కులు లేని పుస్తకాలను సేకరించి, వాటిని డిజిటల్ రూపం లోకి మార్చి, నిర్వహించే ఒక స్వేచ్ఛాయుత గ్రంథాలయమిది. అన్ని రకాల చారిత్రక సాంస్కృతిక గ్రంధాలు, కావ్యాలు ఉచితంగా అనేక భాషలలో, అనువాదాలలో భద్రపరచడం (హోస్ట్ చేయడం) వికీసోర్స్ ప్రాజెక్టు లక్ష్యం. ఈ గ్రంథాల లోని సమాచారాన్ని వికీపీడియా వ్యాసాల్లో సముచితమైన చోట్ల వాడతారు కూడా.
కాపీహక్కులు ముగిసిన పుస్తకాలను డిజిటల్ రూపంలో చేర్చడమే కాకుండా, వాటిని పాఠ్యం (టెక్స్ట్సు) రూపంలో టైపించి కూడా వికీసోర్సులో అందిస్తారు. తద్వారా ఈ పుస్తకాల లోని సమాచారాన్ని గూగుల్ వంటి సెర్చి ఇంజన్ల ద్వారా వెతికే వీలు కూడా ఉంటుంది. అంటే, “మెత్తని పులి” అనే పదం ఏయే తెలుగు పుస్తకాల్లో ఉందో వెతకాలంటే ఈ టెక్స్టుల్లో వెతికి
వికీపీడియా గురించి మీకు తెలుసా? 33