పుట:Wikipedia Gurinchi Meeku Telusa?.pdf/15

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అలా రాయబడిన విజ్ఞానసర్వస్వం ఉచితంగా వాడుకోవచ్చు, స్వేచ్చగా పంచుకోవచ్చు. అలాంటి సదుపాయం వికీపీడియాలో మాత్రమే ఉంది.

  • ఈ రోజు మనకు తెలిసిన జ్ఞానం ఎక్కడనుండి సమకూరిందనే విషయానికి వస్తే, మనకన్నా ముందు తరాలవారు రాసిన గ్రంధాలు ద్వారా మనకు సమకూరింది. అలాగే మన ముందు తరాలవారికి మారుతున్న కాలాన్ని బట్టి అంతర్జాలంలో (నెట్) తగిన సమాచారం అందుబాటులో ఉండటానికి రాయాలి. తెలిసిన జ్ఞానం అందరికి పంచితేనే ఆ వ్యక్తికి, జ్ఞానానికి సార్థకత చేకూరుతుంది. ఆది నెరవేరాలంటే వికీపీడియా మంచి వేదిక.

ఇంతటి పెద్ద పనికి ఖర్చు కూడా గట్టిగానే అవుతుంది కదా, మరి ఆ ఖర్చుకు డబ్బులెలా సమకూరుస్తున్నారు?

  • విరాళాల ద్వారా! సాఫ్టువేరు అభివృద్ధికీ, సర్వర్లు, ఇతర మిషన్లు కొనడానికి, హోస్టింగుకూ అవసరమైన ఖర్చుల కోసం విరాళాలు సేకరిస్తారు. ఈ విరాళాల సేకరణకు, తెలుగు వికీపీడియా లాంటి వెయ్యి పైచిలుకు ప్రాజెక్టుల నిర్మాణ నిర్వహణ, పోషణకూ వెన్నుదన్నుగా నిలబడిన సంస్థ ఒకటి ఉంది. అదే... వికీమీడియా ఫౌండేషన్!

వికీ ఐదు మూలస్థంభాలు

వికీపీడియా కొన్ని మౌలిక సూత్రాలపై ఆధారపడి పనిచేస్తుంది. వికీపీడియాలో పనిచేసే స్వచ్ఛంద సేవకులు ఏ అడ్డంకులూ లేకుండా సావధానంగా పనిచేసుకునేందుకు ఈ నియమాలు వీలు కలిగిస్తాయి.

వికీపీడియా గురించి మీకు తెలుసా? 17