అధ్యక్షుని వచనము 02 పద్ధతికి ననుకూలించిన స్థలములమాత్ర మట్టి శైలిని వ్రాయుదురు. నన్న య్యయొక్క జాల మేమనఁగాఁ దత్సమపదభూయిష్ఠమైన శైలికిని, మృదుత్వము మాధుర్యము మొదలగు కోమలములైన గుణములకును సంయోగము స్థాపించుట. ఈ మాహాత్మ్య మితని యందట్ల, ఎఱ్ఱ న్న లోఁ గలదు. నన్నయ్యలో సాంస్కృతికాన్వయములు తఱుచుగఁ గలవు. అవియును బద్యమును గంభీరముగ శబ్దించునట్లు చేయునేకాని విషయవైశద్యమునకు నర్ధ స్పాష్ట్యమునకు నేమాత్రము భంగకర ములు గావు. సులభగ్రాహ్యమైన, సాంస్కృతిక శైలి కొక యుదాహర ణము :- చం. అలఘుఫణీంద్ర లోకకుహరాంతర దీ ప్త మణిస్ఫురత్ప్రభా వలిగలదాని శశ్వదుద వాస మహావ్రత శీత పీడితా చలముని సౌఖ్య హేతు విలసద్బడబాగ్ని శిఖాచయంబులన్ వెలిఁగెడు దానిఁగాంచి రరవిందని భావనలమహోదధిక్. ( ఆదిపర్వము, ఆశ్వా అ; పద్యము అరా) భారతకవులలో శ్లేషయొక్క ప్రాపులేని పూర్ణోపములు మెండు. మధ్యకాలపుఁ గవులలో నట్టి సందర్భముల శ్లేష నాధారముగాఁ జేసి కొనుట పద్ధతి :- మ. అమితాఖ్యానక శాఖలంబొలిచి వేదార్థామలచ్ఛాయమై సుమహావర్గ చతుష్క పుష్పవితతిన్ శోభిల్లి కృష్ణార్జునో త్తమ నానాగుణ కీర్తనార్థఫలమై ద్వైపాయ నోద్యానజా త మహాభారత పాకిజాత మమరున్ ధాత్రీ సుర ప్రార్థ్యమై, ( ఆదిపర్వము, ఆశ్వా ౧_ పద్యము ) 1 మధ్యకవులు (అనఁగా రామరాజభూషణుఁడు మొదలగువారు) ఇట్టి వర్ణన చేసియుండి లేని బ్రాహ్మణులు, పక్షులు అని రెండర్థముల నిచ్చుపదములు మొదలగు వానిని వాడి యుందురు, CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri
పుట:Vyasa Manjari (Telugu) By C. Rama Linga Reddy, 1939.pdf/31
ఈ పుటను అచ్చుదిద్దలేదు