పుట:Vyasa Manjari (Telugu) By C. Rama Linga Reddy, 1939.pdf/246

ఈ పుటను అచ్చుదిద్దలేదు

232 వ్యాసమంజరి

యుండుట భజనల మూలత త్త్వమునకు విచ్ఛేదకరము. నేను జిన్న వాఁడ నుగా నున్నప్పుడు మాతండ్రి కట్టమంచిలో స్థాపించిన భజనకు బ్రాహ్మ వచ్చుటయేలేదు. సాధారణముగ వారు భజనలకు రారు. ఏకారణముచేతనో కాలక్రమేణ కొన్ని గ్రామములలో నూరివారే ప్రతిసాయంకాలము భజన చేయుట మానుకొనినారు; అట్లు మాను కొనిన గ్రామములలో నేవిధముగానైనఁ బూజ నిలిచిపోక యుండవల యుఁగదా యను భ్రమచేతఁ బూజారులు నియమింపఁ బడినట్లు తోఁచు చున్నది. ఇది బుద్ధిలేనిపని. భజనలలో జరగవలసిన క్రియ యొక్క టియ—స ముష్టిగాఁ జేయు సంకీర్తనము; అదిలేనిచో నదిభ జ న కాదు. మఱి, పూజారులర్చనల కారంభించి రేని గుళ్లలో గుడిగా మాఱిపోవును. భజనమందిరముఁ గట్టియు దానివల్లఁ జెందవలసిన ఫలమును మనము చెందకపోవుటయేగాక, యింకొక గుడిని నెత్తిని వేసికొన్న వార మగు దుము.

భజనకూటమును గుడిగా మార్చుట దేవునికి దేశమునకుఁ దక్కువతనము. గుడిని భజనకూటముగా మార్చినయెడల దేవుని యొక్క యుఁ బ్రజలయొక్కయు ఘనతను బెంపొందించినట్లు.

సంపూర్ణము.