పుట:Vyasa Manjari (Telugu) By C. Rama Linga Reddy, 1939.pdf/24

ఈ పుటను అచ్చుదిద్దలేదు

00 వ్యాసమంజరి సరిపడ నేరదు. భారతము నన్నయ్యకుఁ బూర్వము తెనిఁగింపఁబడియుం డలేదు. ఉండినచో దా నుపక్రమించి యుండఁడు. ఇట్టియుద్గ్రంథమును వదలి చిల్లరపుస్తకములఁ గాల్చుకొనుచుఁ జలిఁ దీర్చికొనుచుండిరనుట హాస్యరసమునకు లక్ష్యము. మఱియుఁ దెనుఁగులోని మత గ్రంథములు సంస్కృతమాతృకలు గలయవి. తల్లులను విడచి కూఁతులను మాత్రము చెఱవట్టిరనుట వారికి లేని రసికత్వమును గల్పించుట. నాకుంజూడ నన్నయ్య కంటె ముందుగఁ దెనుఁగునఁ గావ్యరచన లేదని తోఁచు చున్నది. కారణములు :- (౧) పూర్వము విద్యయనఁగా సంస్కృతవిద్య. అది మంత్ర ములరీతి బ్రాహ్మణాధీనము. క్షత్రియులకుఁ గొంత ప్రవేశముండెఁగాని, యితరవర్ణులు విద్యాబహిష్కారము ననుభవించుచుండిరి. అగ్రవర్ణులు దేశ భాషలయందును బ్రవీణులు. అయినను మతము మొదలగు విద్యలు హీనకులులకుఁ దెలియకుండునట్లు గోప్యముగ నుంచి రక్షించుకోవలయు నని యెంచి ప్రవర్తించుచుండిన వారగుట, వారు సామాన్యముగ వాడుక లోనుండు భాషలో గ్రంథములు వ్రాయక యుండిరి. వారికి, దేవభాషయ కాని దేశ భాష పనికిరాదు. తుదకు దానశాసనములను సయితము తఱుచు సంస్కృతముననే కల్పించిరి. అట్లయిన రాజరాజు కాలములోఁ దెనుఁగున భారతమువంటి ప్రమాణ గ్రంథము, అనఁగా హిందూమతము ప్రకారము ప్రమాణ మైనది, రచింపఁబడుట యెట్లు సంభవించెను? బౌద్ధులు, జైనులు, మొదలగు వేదని రాకరణవాదులు తమతమ మతములలో జనులను జేర్చికొనవలయునను నుద్దేశముతో మాతృభాషలలో గ్రంథములు వ్రాసి వానికి వ్యాప్తిని బ్రసిద్ధిని బడసియుందురు. బౌద్ధుల గ్రంథము లనేకములు మాగథియను ప్రాకృత భాషలో వ్రాయఁబడియుండుట దీనికొక దృష్టాంతము, ఆంధ్రులలో ననేకులు బౌద్ధ జై నమతముల CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri