వ్యాసమంజరి నంగీకరింపని కౌత్సుని తర్కములు, న్యాయాదిశాస్త్రములు మొదలగు కారణములచే వర్ణ ధర్మములకు భంగము కలుగుచుండఁగా దానిని నివారించుటకుఁ బ్రయత్నించినవారిలో రాజరా జొక్కఁ డైయుండె ననుట స్పష్టము. ఆదిపర్వమున సంద ర్భానుసారముగ వేంగీదేశమును వర్ణించుచు, దానియొక్క ముఖ్యవిభవము “శిష్టా గ్ర హార భూయిష్ఠ మై, ధరణీసురో త్తమాధ్వర విధానపుణ్య సమృద్ధ మై యుండుట యని నన్నయ తృప్తితోఁ దెలిపియున్నాఁడు. మాతృకలో లేని యీ విష యమును సంఘటించి యుండుట చేత నది యెంత ముఖ్యమైనదిగా భావింపఁబడి యుండవలయును! ఊహింపుఁడు. హిందూ పునరుద్ధరణము దాల్చిన తెఱఁగులు రెండు. పూర్వ మీమాంసాపద్ధతి; వేదాంతపద్ధతి. వీని తారతమ్యముల వివరించుట ప్రస్తుత మనావశ్యకము. ఒక్క భేదము మాత్ర మీ చర్చకు ముఖ్యము. పూర్వవి మాంసకులు యజ్ఞములు, హోమములు మొదలగు వైదిక పూర్వమీమాంసకులు క్రియలు అవశ్యాను జ్ఞేయము అని గ్రహించిరి. అవి యాకాలమున కే యాచరణలో సామాన్యముగ లేక పోవుట చేతను, వానిని బురాచరణ మునకుఁ దెచ్చుట యసాధ్యమని తోఁచినందునను, వైదిక క్రియలలో గ్రహింపఁబడిన బలివిధానము లహింసాధర్మమునకుఁ బ్రతికూలము లగుటచేతను, ఈ యహింసాధర్మము బౌద్ధమత ప్రభావముచే సర్వ వ్యా ప్త మగుటయు, శంకరాచార్యులు మొదలగు వేదాంతులు వానికిఁ బ్రాధాన్యము నీయరైరి. ఎట్లును వేదములయందు మనకు భక్తి యున్నను, వైదికమత మేమో యెన్ని శతాబ్దముల క్రిండన్లో నశించినది. ప్రకృతము మనము గమనింపవలసిన విషయ మేమనఁగా నాంధ్ర మండలములో వ్యా ప్తికివచ్చినది పూర్వమీమాంస, అనఁగా వైదిక క్రియానిరతి. హిందూవునరుద్ధారకులలో శంకరాచార్యులకుఁ బూర్వి కుఁడును, నతి ముఖ్యుఁడును నయినవాఁడు కుమారిలభట్టు. CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri
పుట:Vyasa Manjari (Telugu) By C. Rama Linga Reddy, 1939.pdf/22
ఈ పుటను అచ్చుదిద్దలేదు