iv
ములు వ్రాసినను, తాత్వికముగా విషయచాలన మొనర్చి, పటుత్వము గల భాషలో సోపపత్తికమైన సిద్ధాంతముచేయు నేర్పు వీరివాక్కునకు సహజగుణము. వీరివ్యాసములకు ఇదియే ప్రథమాలంకారము. రెండవది వానిశైలి. విషయాన్నత్యముతో పాటు అర్థగాంభీర్యమును, దాని కనుగుణమగు శైలియు ఉన్నప్పుడే, వ్యాసము సర్వాంగసుందర ముగా నుండును. అర్థ గాంభీర్యము లేనిచో పేలవతయు, శైలీసంపన్నత లేనిచో నీరసతయు తటస్థించి వ్యాసమునకు తీరనిలోటు కలుగును. వీరి వ్యాసములలో అర్థమెంత గంభీరముగా నుండునో, శైలియు అంత సురుచిరముగా నుండును. ఆశైలియు, విషయవిభేదమునుబట్టి ఒక్క యెడ ఆలంకారికముగా, ఒక్క యెడ ప్రాస్తావికముగా, ఒక్క యెడ తార్కికముగా మారుచుండును. ఏ రూపము తాల్చినను, దానిపటుత్వము, సొగసుదనము, పోవు. నన్నయసూరనలను ప్రశంసించుచో, శైలియెంత ఆలం కారికముగా నున్నదో తాతతండ్రులు ముచ్చటలు చెప్పుచో అంత ప్రాస్తావికముగా నున్నది. ఇన్ని అవాంతరరూప భేదములు పొందుచున్నను, దానికి ఆ త్మీయమైన మూలధర్మమును విడనాడదు. వీరిశైలికి ఆత్మీయాంశము బుద్ధి గమ్యత. నానాశాస్త్రనిష్ణాతమును, విజ్ఞానసాంద్రమును, సమ్యగ్యోజనాయుతమును ఐన మేదస్సున బుట్టిన భావములు గలర చన బుద్ధి గమ్యము గాక ఇంకొక విధముగా నుండదు, ఉండదగదు.
నూతనశాస్త్రపరిచయమువలననో, అన్యసంప్రదాయసంపర్కమువలననో, ఒక సంఘములో గాని, ఒక వ్యక్తిలోగాని అపూర్వభావములు పొడమునపుడు వానిని వ్యక్తీకరించుటకు పూర్వస్థితమైన సాధారణ భాష చాలదు. అట్టియెడ నూతన పదజాలము సృష్టించుటో అన్య దేశ్యములు ప్రయోగించుటో, పూర్వపదములనే, లక్షణార్థమున వాడుటో తప్పనిసరియగును, ఈ మూడుపద్ధతులలో అన్య దేశ్యపద