ii
వారి వాఙ్మయము చదివి, ఆరుచి గ్రహించిన పిమ్మటనే మనవారు తద నుకరణముగా, నవలలు- కథానికలు వ్యాసములు మొదలగు నానా వచన గ్రంథములను రచింప మొదలిడిరి. ఈ నూతనగద్య గంగావతరణ మునకు చిన్నయసూరి భగీరథుని వంటివాడు. దాని నానా ముఖా ప్రతి హత ప్రవాహగతికి కారణభూతుడు వీ రేశలింగముపంతులుగారు, వచన ప్రపంచమున పంతులుగారు త్రొక్కని దారిలేదు. ధారాళమును, తేట తెల్ల మును అయిన శైలిలో వారు వ్రాసిన శతాధిక వచనములు వారి గద్య తిక్కన బిరుదమును సార్థకముచేసెను. సార్థకముచేసెను. ఆ రచనలన్నిటిలో కవుల చరిత్ర చిరస్థాయియై, వారికీ ర్తిని చిరస్థాయిగా గా కాపాడగలదు. పూర్వ కవుల జీవితాంశములను, చారి శ్రకపరిశో ధనపూర్వకముగా నిర్ణయించు తలంపుతో పంతులుగారు సల్పిన కృషి అనన్యసామాన్యము. కాని వారాసించిన ముఖ్య ప్రయోజనము ఆయాకవుల ఆయాశవులు కాలనిర్ణ కాలనిర్ణయము మాత్రమే. ఆశవుల గ్రంథ విమర్శనము నెడ వారికంత దీక్ష లేదు. ప్రసంగ వశమున గ్రంథ గుణమునుగూర్చియు ఏ కొలదిపాటి ప్రశంసయేని ఉన్నను, అది విమర్శనమనిపించుకొన దగినట్లుండదు. యథార్థమైన ఆంధ్ర కావ్యవిమర్శ ప్రారంభము కవుల చరిత్ర పుట్టుకకు తరువాత జరిగి నది. ఆ మహారంభమునకు ప్రథమాచార్యులుగా పేర్కొనదగినవారు శ్రీ కట్టమంచి రామలింగారెడ్డిగారు.
శబ్దసాధుత్వాసాధుత్వనిర్ణయమే గ్రంథవిమర్శనమనెడిభ్రమతో పండితు లొకరితో నొకరు వాగ్యుద్ధములు చేయుదినములలో, భావుకులదృష్టిని శాబ్దిక చర్చనుండి తాత్వికమీమాంసకు మరల్చిన రసికులు రెడ్డిగారు. కావ్యమునకు శబ్దము ఆధిభౌతికాంశము మాత్రము. అది బాహిరము. దాని ఆధ్యాత్మికాంశము తద్గతకళాసౌందర్యము. అది ఆంతరము. విమర్శమార్గమును బాహిరజగత్తునుండి అంతర జగత్తునకు కొనిపోయిన ప్రథమాంధ్రవిమర్శగ్రంథము రెడ్డిగారి కవిత్వతత్వవిచా