ఈ పుట ఆమోదించబడ్డది

ని కాయలలోని గింజలు మంచివి. ఈ గింజలనుండి నూనెదీయుదురు. దీనిని వంటలో గూడ వాడుదురు. మరియు జిత్రపటములు వ్రాయుట యందును బనికి వచ్చుచున్నది. గసగసాలను కొన్ని పిండి వంటలలోను తాంబూలములోను గూడ వాడుదురు.

బ్రహ్మదండి:- మొక్క ఎక్కడైనను బెరిగిన నూడబెరికిపారవేయు చున్నారుగాని దాని లాభము గమనించుట లేదు. దానివాడుకయు నెందుచేతనో యతగాలేదు. కాని గింజలనుండి తీసిన చమురు, తలుపులకును, బల్లలకును అన్ని చెక్కలకును మెరుపు దెచ్చును. చిత్రపటములు వ్రాయుటలోను బనికి వచ్చును. కొందరు తలనొప్పిని కూడ బోగొట్టు నందురు. ఈ నూనె కడుపు నొప్పులు మొదలగు వానిని బోగొట్టును. దీని యాకుల రసము పుండ్లను మానుపును.

నిజమైన బ్రహ్మదండి మొక్క వేరేయున్నదని కొందరు చెప్పు చున్నారు.