ఈ పుట ఆమోదించబడ్డది

రెండు వరుసలుగా నేయుండును. కణుపుపుచ్చము లుండవు. సమాంచలము కొన్నిటియాకులకును సువాసన గలదు. వృతాగ్రముగోపురమువలెనుండును. రక్షకపత్రములును, ఆకర్షణ పత్రములును వలయమునకు మూడేసి గలవు. కింజల్కములును, స్త్రీ పత్రములును అసంఖ్యములు. కింజల్కపు కాదల సంయోగకములు పుప్పొడితిత్తుల పైకివచ్చియుండును. గింజలకు బీజపుచ్ఛము గలదు.

1. ఆకులు. 2. పూలగుత్తి. 3. ఒక పువ్వు నిడివి చీలిక, కింజల్కములును స్త్రీ పత్రములును గోపురము వలె నున్న వృంతాగ్రముపై నున్నవి.


రామాఫలపు చెట్టు:-- ఇంచుమించు సీతాఫలమువలెనే యుండును. పండు మాత్రము కొంచమెర్రగను నున్నగను