ఈ పుట ఆమోదించబడ్డది

చేయును. ఇవి మనకు బయటి దేశముల నుండియే వచ్చు చున్నవి.


సీతాఫలపు కుటుంబము.


సీతాఫలము చెట్లు మనదేశమునందంతటను బెరుగుచున్నవి.

ఆకులు: -- ఒంటరి చేరిక, కొమ్మకు రెండు వైపులనే యుండును. లఘుపత్రములు, కురుచ బొడిమ, కణుపుపుచ్చములు లేవు. సమ గోళాకారము, సమాంచలము కొనసన్నము.

పుష్పమంజరి: -- కణుపుసందుల నొక్కొక్కపుష్పముండును. సతాళము. అకు పసుపు రంగు.

పుష్పకోశము: -- రక్షక పత్రములు మూడు. చిన్నవి. నీచము.

దళవలయము: -- ఆకర్షణపత్రములు మూడు. పెద్దవి. సన్నముగ నిడివి చౌకపునాకారముగను దళసిరగను నుండును.

కింజల్కములు: -- అసంఖ్యములు. సంయోజకములు పుప్పొడి తిత్తులపైకివచ్చి యున్నవి.

అండకోశము: -- స్త్రీపత్రములన్నియు విడివిడిగా నున్నవి. అవి చాలగలవు. ఒక్కొక్క దాని కొక్కొక్క కీలమున్నది. స్త్రీపత్రములును గింజల్కములును గోపురమువలెనున్న వృతాగ్రముపై నున్నవి. ఫలము, కండకాయ.

ఈ కుటుంబములో బెద్దచెట్టును గుబురు మొక్కలును గలవు. కొన్ని తీగెలవలె నల్లుకొనును. ఈమొక్కలు శీతలదేశమునందంతగా లేవు, ఆకులు, ఒంటరిచేరిక. సాధారణముగ