ఈ పుట ఆమోదించబడ్డది

42


తొగరు, పనస, అనాసకాయలలో చాల పుష్పములు గలసి ఒకకాయాగ ఏర్పడు చున్నది. ఇది మిశ్రమ ఫలము. ఒక్క సంపెంగ పువ్వునుండి చాల కాయలు వచ్చు చున్నవి. ఇవి సమూహ ఫలములు. జీడిమామిడి పండులో మనము గింజ అనునదియెకాయ. గింజనంటుకొని యున్న 'కండకాయ వృతమె పువ్వు యొక్క కాడ యందు కండ బట్టుటచే నిట్లేర్పడినది. కాశి రేగు పండులోను వృతమే కండపట్టుచున్నది. కాయవృంతము లోపల దించుకొని పోయి యున్నది. ఇది వృంతఫలములు.