ఈ పుట ఆమోదించబడ్డది

505

కల్లుపులియట, దాని నుండి చిక్కబడుట మొదలగు వానికి కారణ మగు మధుశిలీంద్రకణములు నిట్టివే., వానికిని న్యూతబీజములు గలవు.


ఒక్కొకప్పుడు గోదుమ చేలు పాడగునపుడు వాని ఆకుల మీద పచ్చనివి గోదుమ వర్ణము గలవి చారలగు పడును. ఈ చారలలో నుండి పొడి పొడి వంటి పదార్థము వచ్చుట చూడ నగును. దీనిని భూత దర్పణము క్రింద బెట్టి పరీక్షించితిమా అచ్చోట బూజు గలుగుటయు, ఆబూజు పలు గదులు గలది యగుటయు, తంతువులు సరిగ నుండక, కొమ్మలు రెమ్మలుగ నుండుటయు కనబడును. ఆకు లోపల నీ బూజును పొడి వంటి సిద్ధ బీజములు నేర్పడుట చేత ఆకు అచ్చోట పగులు చున్నది. అపగులులో నుండియే సిద్ధ బీజములు బైటకు వచ్చు చున్నవి. అవి అండాకారముగ నున్నవి. వాని కవచము దట్టముగా లేదు గాని మూడు చోట్ల మిక్కిలి సన్నముగా నున్నది. ఇది నీళ్ళలో బడినపుడు ఈసన్నముగానున్నచోటులనుండి కాడలు వచ్చును. ఆమూడింటిలోను నొక్కటియే పొడుగుగా నెదుగును. ఇట్లుండగా నిది యేఆకుమీదనైన బడని యెడల బెరుగక చచ్చిపోవును.