ఈ పుట ఆమోదించబడ్డది

496

ములు, సూక్ష్మబీజములు సంయోగము బొందు చున్నవి. వీని గురించి పూర్తిగ తెలిసికొనుట సూక్ష్మ దర్శని యున్న యెడల గాని సాధ్యము గాదు కనుక, ఎక్కువగా వ్రాయ లేదు.

నీటి పాచి లాభము గానె యగుచున్నది. అది నీటిలో నుండు జంతువులకు కొన్నిటి కాహారము. దానిని కాల్చి బూడిదనుండి ఆయెడిను చేయు చున్నారు.


వంశము
- అవయవరహితము: ఉప వంశము:

కుక్కగొడుగు, బూజు

వందల కొలది అడుగులెత్తు పెరుగు మహా వృక్షములతో గలిసి వ్రేలెడెత్తు లేని కుక్క గొడుగులును, దెప్పల మీద బుట్టు బూజును కూడ మొక్కలే యనిన నవ్వుల మాటల వలె దోచునేమో కాని, యివియు మొక్కలే. కాని అన్ని మొక్కల యందు నుండు ఆకు పచ్చని రంగు గాని, వేరు కొమ్మ ఆకు అనుభేదము గాని వీని యందు లేదు. వీని స్థితి గతులే వేరు.

బూజునకు పెరుగ వచ్చు చోటు, పెరుగ రాని చోటు అని లేదు. ఎచ్చట ఆహార పదార్థము దొరుకునో, అచ్చట కొంచెము చోటు చిక్కిన యెడల ప్రవేసించి నాటుకొని విజృంభించును; చెట్ల మీద, దూలముల మీద పేడ కుప్పల