ఈ పుట ఆమోదించబడ్డది

472

ఇవి మూడు మొదలు ఆరడుగుల ఎత్తువరకు పెరుగును. వీనిలో పిట్టగంట్లు, ఎర్రగంట్లు మొదలగు బేధములు గలవు.

కొర్రలు ఒక గింజ నుండియే నాలుగైదు కాడలు బయలు దేరు చున్నవి. ఇవి గుండ్రముగా మూడు మొదలు ఆరడుగుల యెత్తు వరకు పెరుగును. ఆకులు గరుకుగా నుండును. కొఱ్ఱలను బీదలు తిందురు.

నక్కకొఱ్ఱలు మెట్ట పంటలు పండు చోట పెరుగును. అవి మూడడుగులు ఎత్తు వరకు పెరుగును. కాని ఒక్కొక్కప్పుడు నేల మీదనఏ పడి యుండి వేళ్ళు వేయు చుండును. అల్ప కణిశముల క్రింద బిరుసగు రోమములు గలవు.

బొంతచామలు మెట్ట పంట.- కాడలు రెండు మొదలు నాలుగడుగుల ఎత్తు వరకు నుండును ఆకుల అంచులు గలవు. చిరుకంకులు దగ్గిర దగ్గిరగా నుండును. వీనిని సాధారణముగా, బొలములలో వెద జల్లుదురు కాని ఆకు నీళ్ళు పోసి యూడ్చరు. కొన్ని చోట్ల ఆరు వారములకే పంటకు వచ్చును. వీనిని బీదలు తిందురు.

నల్లచామలు ఆకులు పొడుగుగాను, సన్నగా నుండును. కంకులు గోదుమ వర్ణము ఇవియు మెట్టపంటయే. వీనిని తిందురు.