ఈ పుట ఆమోదించబడ్డది

466

దూస్థానము నందే గలదు. దక్షిణ దేశమునంది వేడిమియు వర్షములును ఎక్కువ గా నుండును కావున వీని పంటకంత అనుకూలముగ నుండదు.

గోదుమలతో గలపి ఇతర పైరులను కూడ చల్ల వచ్చును. ఒక భూమిలో నేటేట వానినే జల్లుట కంటె ఒక సంవత్సరము వానిని రెండవ సంవత్సరము చిక్కుడు కుటుంబము లోని దగు నేపైరునైన చల్లుట మంచిది. చిక్కుడు కుటుంబములోని వానిని జల్లుట వలన భూమి సార వంతమగును., కాని సారము తగ్గదు. గోదుమలలో నాలు ముఖ్య మైన అరకములు గలవు, 1, తెల్లగాను మెత్తగాను నుండును. 2, తెల్లగాను గట్టిగాను నుండును. 3. ఎర్రగాను మెత్తగాను, 4. ఎర్రగాను గట్టిగాను నుండును. పంజాబు రాష్ట్రమునందు 10,184 ఎకరములు గోదుమలు పండు చున్నవి.

గోదుమల పంటకు మెరక నేలలందు వర్షములకు ముందును, పల్లపు నేలలందు వర్ష ఋతువైన పిదపను సాగు చేయుట నారంభింతురు. వీని కప్పుడప్పుడు తెగుళ్ళు పట్టు చుండును. ఇవి లేత మొక్కలుగ నున్నప్పుడొక విధమైన బూజు ప్రవేసించి కంకులలో చేరి యుండును. మొక్కకు తెగులు గుట వెన్ను లీను వరకును తెలియ రాదు. చేలు నాలుగు