ఈ పుట ఆమోదించబడ్డది
459
లదు. ఈవేళ్ళను పొడుముచేసి నూనెలో వేసికొందుము. అగరు వత్తులు చేయుటలో కూడ నీ పొడుమును ఉపయోగించు చున్నారు.
గొడ్డుతుంగ చిన్న మొక్క. ఆకులు మూడో నాలుగో మాత్రమున్నవి. పసువులు దీనిని దినవు. గేదెలు మాత్రముకొంచము కొంచము తినును.
తెగడతుంగ నీడ తడి యున్న చోట్ల పెరుగును. పువ్వుల కంకులు తెల్లగా నుండును. పశువులు దీనిని తినును.
చలితుంగ నీటి వార పెరుగు చున్నది. వేళ్ళు నార వేళ్ళ వలె సన్నముగా నుండును. దీనికి ఆకులు చాల గలవు.
జల్లెడతుంగ నిలుకడగ నున్న మంచి నీటి గుంటల్లో పెరుగు చున్నది. అది ఆరడుగుల వరకు పెరుగును. ప్రకాండము మూడు పలకలు. పలకలయంచులు వాడిగ నున్నవి.
కఱ్ఱతుంగ చెరువులలోను కాలువల లోను రెండు మొదలు అయిదడుగుల ఎత్తు వరకు పెరుగు చున్నది. దీని కాడ గట్టిగాను, ఆకులు గరకుగాను నుండుటచే పశువులు దీనిని తినవు.