ఈ పుట ఆమోదించబడ్డది

455

సూరికంద ఎక్కువ్గా మామిడి చెట్ల నీడలను బెరుగును. దీని దుంపలును కందవలె నుండును కాని అంత కంటె చిన్నవి. కొంచెము తెల్లగా నుండును. ఈ దుంపలనరుగ దీసి కంతులకును బాము కాటులకును వేయుదురు. దీనిని సరిగా ఉపయోగించిన ఎడల మంచి పని చేయును.

అడవి కంద కొండల మీద పెరుగును. దాని దుంపలు కోలగా నుండును. వీనికి నొక విధమగు వాసన గలదు. రెండు మూడు మారులు నీరుతో ఉడక బెట్టిన గాని వాసన పోదు. దీనిని కొండ మీద నుండు వారే తినుచున్నారు.

అడవిచామ మొక్కకు ఆకులు ఒకటో రెండో మత్రము పుట్టుచున్నవి. దీనిని కొండ జాతులు తిందురు.

గజపిప్పలి అడవులలో చెట్ల మీద ప్రాకును. దీని కాయల నెండపెట్టి ముక్కలుగా కోసి గజ పిప్పలియని అమ్ముచున్నారు. దీని ఔషధములలో వాడుదురు.

మూలసరి ఆకుల అడుగున ముండ్లుగలవు. పువ్వులలో కింజల్కములు చాల యున్నవి. కాయ నాలుగు పలకలుగా నుండును.