443
త్సరములురాగానే కాయలు కాయుటకు ఆరంభించి, రమారమి ఆరువది సంవత్సరములవకరుకాయును. ఒక చెట్టు సాధరణముగ రెండు గెలలు వేయును. కాని నేల సార వంతమైన యెడల మూడు నాలుగు గెలలు కూడ వేయును. ఒక చెట్టునకు సాధారణముగ 300 కాయలు దిగును. వర్షాకాలములో కాయలపై విస్తారము వాన కురిసినచో అవి కుళ్ళిపోవును గాన వాని పై పోక దొప్పలను కప్పు చుందురు. చెట్లెక్కి దొప్పల గట్టు వారు నిపుణులగుచో ఒక చెట్టు నుండి మరియొక చెట్టుంకు ఆకులను బట్టి కొనియే పోగలరు. కొన్నికొన్ని తోటలందొకప్పుడు కాయలు పుచ్చు చుండును. పుచ్చునపుడు పువ్వుల మీదను కాయల మీదను నల్లని మచ్చలు బయలు దేరును. ఈ మచ్చలు వర్షము తగిలినచో ఎక్కువగును. కావున వర్షాకాలములో వానిపై దొప్పలను గప్పుట ఆవస్యకము. ఒకొక్కప్పుడు చెట్లకు చెద కూడ పట్టుట కలదు. విస్తారమెండలు కాయు చున్న దినములలో నీరునెక్కువగా పోయ కూడదు. పోసినచో చెట్టు తలలు విరిగి పడి పోవును. పోకతోటలందు చెమ్మ యారకుండుటయో కొంచెముమంచిది. పొగాకు, అల్లము, పసుపు తమలపాకు మొక్కలు చెమ్మ నారనీయవు గావున వానిని గూడ పోకతోటలందు వేయుట మంచిది.