ఈ పుట ఆమోదించబడ్డది

443

హింతాలవృక్షము ఆరు, ఏడు అడుగులెత్తు పెరుగును గాని దాని8 ంరాను ఈత, ఖర్జూరపు మానుల కంటె సన్నముగా నుండును. దీనిలో పోతు చెట్లు ఆడు చెట్లు గలవు. ఆకుల కొంచెము ఈతాకులవలె నుండును. మొదట నున్న చిట్టి ఆకులు చిన్నవి. వాని వద్ద ముండ్లు గలవు. దీని కాయలు బాగుండవు. సన్నముగా నున్న మాను చేతి కర్రలకుబాగుండును. ఈ చేతి కర్రలతో నడుచు చుండిన త్రోవయందుండు పాములు తొలగి పోవునని కొందరకు నమ్మకము గలదు.

పోకచెట్టు చిరకాలమునుండియు తోటలలో పెంచుచున్నారు. అవి సముద్రమునకు రెండువందలమైళ్ళ దూరములోను మూడు వేల అడుగుల ఎత్తు ప్రదేశములలోను పెరుగ జాలవు. వానికి నీరును వేడిమియు ఎక్కువగానే కావలెను. విత్తనముల కేబది యిరువది సంవత్సరముల చెట్ల కాయలు మంచివి. అట్టి వానినే తోటలలో నొక మడిలో పాతుదురు. ఒకటి రెండు సంవత్సరములైన పిదప చిన్న మొక్కలను దీసి ఆరేడడుగుల దూరమున నాటెదరు. పోక తోటలలోనె కొన్నిచోట్ల, అరటి, కొబ్బరి, పనసచెట్లనువేయు చున్నారు. మరి కొన్ని తావులందు బాడిదచెట్లను వేయుదురు. ఈచెట్లు లేత పోకమొక్కల కెండదెబ్బ దగులనీయవు. అయిదారు సంవ