ఈ పుట ఆమోదించబడ్డది

438

లో ఎరువువేసి పాతవలెను. కాని విస్తారము ఎరువు వేయుట వలన పురుగు పట్టుట కూడ కలదు. అవి వ్రేళ్ళు తినుటకారంబించి క్రమ క్రమముగ చివస్ర వరకు వచ్చును. కొన్ని పురుగులు లేత మొవ్వలో గ్రుడ్లు పెట్టును. ఇవి పిల్లలై మొవ్వను తిని వేయుట వలన చెట్టు ఎదుగు లేక చచ్చి పోవును. మరి కొన్ని పురుగులు లేత ఆకులను దిని వేయును. కొబ్బరిపంటలో గోదావరి జిల్లానే ప్రధమమున చెప్పవలెను.

కొబ్బరిచెట్ల ఉపయోగములు లోక విదితమే. వీని మాకులు తాటి మాను వలె దూలములుగనుపయోగింపవు. కొబ్బరి మాను కంత చేవ లేదు. ఆకులతో తాటి ఆకు దొరకనొ చోట్ల దడులు పందిళ్ళు వేసుకొందురు. కొబ్బరి తినుటకు, పచ్చడి చేసి కొనుటకు బాగుండును. ఎండలో నడిచి వచ్చిన అతనికి లేత కొబ్బరి నీళ్ళు సేద దీర్చును. కాని విస్తారముగ త్రాగుచో జబ్బు చేయును. కొబ్బారి కాయల నుండి, కురిడీల నుండి చమురుతీయుదురు. పొగలోనిలువచేసిన కాయలనూనె కొంచెము రంగుగానుండును. పరిశుభ్రమైన యెండు కురిడీల నూనె చాల బాగుండును. కొందరీ నూనెను నేతి వలె వాడుకొందురు. తలకు రాచు కొనుటకిదియేమంచిది. ఈనూనెతో క్రొవ్వొత్తులను చేసెడివారు. దీనితో సబ్బు కూడచేయ