ఈ పుట ఆమోదించబడ్డది

432

దీని నార తీయుటయు సులభమే. ఆకులను కోసి నున్నని బల్లమీద నుండి ఒక చివర నొక్కి పట్టి కర్రతో దాని పొడుగున రాచెదరు. ఇట్లు చేయిటచే మెత్తని పదార్థమంతయు నార నుండి విడిపోవును. ఆకులను నీళ్ళలో జీకి పొవరకును నాన వేసినను నార వచ్చును గాని అదంత మంచి పద్దతి కాదు.

శతమూలము వేళ్ళు ముల్లంగి దుంపల వలె నుండును. ఆహార పదార్థస్మీ మొక్క వేళ్ళయందు నిలువ చేసికొనును. ఈ వేళ్ళు తినుటకు బాగుండవు కాని ఔషధములలో పని వచ్చును.

కల్బందమట్టలు ఆకులే. నిలువచేసికొనిన ఆహారపదార్థమాకులయందుండును. ఈ మొక్కల కంతనీరవసరము లేదు. కల్బంద మట్టల రసముతో కొన్ని ఔషధములు చేసెదరు. దానిని కాల్చి కట్తిన యెడల కొన్ని పుండ్లు తగ్గును.

ఘృతకుమారి మొక్క పువ్వులందముగా నుండుటచే తోటలయందు పెంచు చున్నారు.

కొండగరుప తీగ కొమ్మలమీద ముండ్లుగలవు. ఆకులతొడిమల కిరుపక్కల నులి తీగలు గలవు. వీని సాయమున తీగ పైకి బ్రాకును.