ఈ పుట ఆమోదించబడ్డది

431

నొక్కొక్కప్పుడు మొక్క మొలవక పూర్వమే కుళ్ళి పోవును. కనుక ఉల్లిపాయల ముక్కలనే నాటెదరు. ఉల్లి మొక్క కాయలు గాచు కొరకు ఆహార పదార్థము పాయలలో నిలువ చేసి యుంచు కొనునూ. కాయలు కాసిన పిదప ద్రవ్వితిమా పాయలన్నియు హరించి యుండును. ఉల్లి పాయ లేడాదికి రెండు పంటలు పండును గాని యా చోటనే రెండవ మాటు ఉల్లి పాయలను గాక మరియొ పైరు చల్లిన మంచిది.

వెల్లుల్లిపాయలుచిన్నవి. అవి తెల్లగనే యుండును. వానికి వాసన మెండు. ఉల్లి పాయలు దేహమునకు మంచివి. అలసి యున్నప్పుడు వెల్లుల్లి పాయలను దినినచో సేద దీర్చునందురు. చెవి పోటునకును, చెవుడునకును మంచిది. పాయలను నొక్కి రసము తీసి సామానులను తోముటకు ఉపయోగింతురు.

విషమకాడనారమొక్కలు మంచి నేలలందు నీరుసమృద్ధిగా నున్న యెడల మిక్కిలి ఏపుగా పెరుగును. దాని ఆకులప్పుడు నాలుగడుగులు పొడువుండును. వింటి నారికై పూర్వమీ మొక్కలను విస్తారము పెంచెడి వారు గాని బాణముల ప్రయోగమిప్పుడు పూర్తిగ పోయెను గాన నీ మొక్కలను పెంచుటయు మాని వేసిరి. దీని నార మిక్కిలి గట్టిగా నుండును. అయినను ఎందు చేతనో దీని నంతగా వాడుట లేదు.