ఈ పుట ఆమోదించబడ్డది

429

అండకోశము. అండాశయము ఉచ్చము. 3 గదులు. ఒక్కొక్క దాని యందు నాలుగేసి అండములున్నవి. మధ్యస్తంబ సంయోగము.
కీలముపొట్టి
కీలాగ్రము మూడు తమ్మెలు. ఫలము కండ కాయ. రెండు గదులు. పెరుగవు. గింజలు నల్లగా నుండును.
విషమ కాడ నార

పరకాండము. భూమిలోపల చిటికిన వ్రేలు లావున గాడవలె నుండును. ఆకులు మాత్రము పైకి వచ్చును.

ఆకులు ఒక్కొక చోట నుండి 4 మొదలు 8 వరకు గుత్తివలె వచ్చును. వెలుపలి ఆకులు చిన్నవి. మధ్య నుండునవి సుమారు మూ అడుగుల వరకు పెరుగును. గొట్టము వలె గుండ్రముగా నుండును. వాని మీద తెల్లని చారలు గలవు.

పుష్ప మంజరి
ఆకుల మధ్య నుండి కంకి యొకటి రెండంగుళముల వరకు పెరుగు చున్నది. దానిని దట్టమగు నాకు 4, 5 గప్పుచున్నవి. కంకి మీద నొక చోట 4 మొదలు 6 వరకు పుష్పములున్నవి. పువ్వులు పెద్దవి.

పుష్పనిచోళము సంయుక్తము. గరాటి వలె నుండును. 6 తమ్మెలు గలవు. తమ్మెలు సన్నముగా నుండును. నీచము.

కింజల్కములు 6. గొట్టము అడుగు భాగముతో గలిసి యున్నవి. పుప్పొడి తిత్తులు సన్నముగ సమరోళాకారముగను వున్నవి. వీని రెండు గదులు పై నిడివిగా నుండును.