427
పాత దీగెను భూమిమీదనే ప్రాకనిచ్చు చున్నారు. దుంపలు బాగుగ నేడెనిమిది నెలలకు ఊరును. నేలను బట్టియు, రకమును బట్టియు ఎకరమునకు అరువది మణుగుల మొదలు రెండు వందల మణుగుల వరకు వచ్చును.
బంగాళ దుంపల కంటె నివియే బలమగు నాహార పదార్థము.
అవతంగ తీగె మెట్ట నేలలందు మొలచు చున్నది. ఇదియు దుంపలు బారును.
ఉల్లి కుటుంబము.
ఉల్లి మొక్కలను పెక్కు చోట్ల సేద్యౌ చేయుచున్నారు.
ప్రకాండము లసునము. భూమిలోపల నుండును. పలుచగా నుండును. ఉల్లి పాయల అడుగున గరుకుగరుకుగా నుండునదే ప్రకాండము. కొన్ని ఆకులు మార్పు చెంది ఉల్లి పాయలైనవి.
ఆకులు లల్ఘు పత్రములు. సన్నముగాను పొడుగు గాను నుండును. వాని అడుగు భాగము భూమిలో నున్న భాగము, దళసరిగాను, తెల్లగా నుండును. ఆకులు గొట్టముల వలె నొకదాని నొకటి చుట్టుకొని యుండును. సమాచలము సమరేఖ పత్రము. ఉల్లి మొక్క పుష్పించి కాయలు గాచుటకు ఆహార పదార్థమును పాయలలో నిలివ చేసికొనును.
- పుష్ప మంజరి. గుత్తి వృంతము ఆకుల మధ్య నుండి వచ్చును.