422
చిన్నమొక్క్లు ఒకటి రెండడుగులెత్తు పెరిగి తరువాత వానిని దీసి పది, పది, అడుగుల దూరమున పాతవలెను. ఒక వేళ దగ్గర దగ్గరగా పాతిన యెడల ఆకులొక దాని నొకటి రాచుకొని విరిగి పోవును. ఈ మొక్కలు పదేండ్లలో పెరిగి పుష్పించును. గాని యవి పుష్పింఫ బోవు చుండగా మట్లను విరగ కుండ కోసెదరు.
వీని నుండి నారదీయుటకు కొందస్రు ఆకులను బాదెదరు. కాని అది మంచి పద్ధతి కాదు. ఆకులను మరికొందరు నీళ్ళలో మరుగ బెట్టు చున్నారు. కొందరు సన్న సన్నముగా చీల్చి చల్లని నీళ్ళతోనే జాడించి జాడించి మెత్తని పదార్థమంతయు బోగొట్టు చున్నారు. కాని నార దీయుటకిప్పుడు మంచి యంత్రములు గలవు. చాపలు, ' బ్రషు లు మొదలగునవి చేయు చున్నారు. మంచి నార తీయగ మిగిలిన పదార్థముతో కాగితములను చేయు చున్నారు.
వీని పువ్వులు పూసెడు స్థంభపు ముక్కలు కత్తి నూరుటకు దోలు వలెనే బాగుండును. ఆ ముక్కలు కత్తికి పదును దెచ్చును. మట్టల రసముతో సబ్బు చేయ వచ్చును. దీనిని కొన్ని వ్యాధులకును ఉపయోగించుచున్నారు.