ఈ పుట ఆమోదించబడ్డది

28

పువ్వులన్నియు పైదాని యందు వలె నొక వైపునకే నుండక ఒక మాటొక వైపునకు ఇంకొక మాటింకొక వైపునకు నుండును. ఇట్టి దానిని వృశ్చిక మధ్యారంభ మంజరి యందుము.

బొమ్మ (ఉమ్మెత్త పువ్వు. 2. అండ కోశము, కీలము, కీలాగ్రము, 3. దళవలయము కింజల్కము లగుపడునట్లు చీల్చ్ బడినది. 4. కింజల్కము, కాడ, పుప్పొడి తిత్తి.
తెల్ల ఉమ్మెత్త చెట్టు. పువ్వు
నల్ల ఉమ్మెత్త చెట్టు

పుష్ప భాగములు రక్షక పత్రములు, ఆకర్షణ పత్రములు, కింజల్కములు, స్త్రీ పత్రమని మీరీవరకే చదివి యున్నారు. రక్షక పత్రముల కన్నిటికి కలిపి పుష్ప కోశమనియు, ఆకర్షణ పత్రములకు దళవలయమనియు స్త్రీ పత్రమున కంతకు అండ కోశమనియు గూడ పేరులు గలవు. స్త్రీ పత్రము కొనయందుండు కాడను కీల మనియు, కొనదిమ్మను కీలాగ్రమనియు చెప్పుదురు.