ఈ పుట ఆమోదించబడ్డది

399

లు చేయుచున్నారు. రబ్బరు మనదేఅములో కూడ కొంచెమో గొప్పయో దొరుకు చిండినను దానితో మనకేమిచేయుటకు చేతకాకున్నది.

జువ్విచెట్టు కూడ చాల పెద్ద చెట్టు. దీని ఆకుల తొడిమలు పొడుగుగానుండును. దీని లోను పాలుగలవు.

ఎర్రజువ్వి ఆకులతొడిమలు పొట్టివి. లేతకొమ్మలు మిక్కిలి నున్నగా నుండును.

పిట్టమర్రి చెట్టును కొండలమీద పెరుగు పెద్దచెట్టు దీనికిని ఊడలు గలవు. కాని అవిపెద్దవికావు.

పుత్రజీవియు కొండలమీద పెరుగును. దీనిఆకులకొన వంకరగను సన్నముగను నున్నది.

తెల్లభరిణిక చెట్టుకూడ కొండప్రదేశములందే పెరుగును. మాను పొట్టి ఆకులు శీతా ఫలపుఆకులవలె కొమ్మకు రెండువైపులనే యుండును.

గజనిమ్మచెట్టు. మిక్కిలి పెద్దదిగాదు. దీనిపండ్లను తిందురు. మొగకంకులను కూరవండుకొందురు. ఈ చెట్టులోను పాలుగలవు.