398
లేత మొల్కలు రెండుమూడుఅంగుళముల ఎత్తు పెరుగగనే వానిని దీసి మరి యొక మడిలో పాతుదురు. అచ్చట రెండు మూడు అడుగుల ఎత్తు పెరుగగనే దీసి చెట్లను పాతవలసిన చోట దూర దూరముగ పాతుదురు. లేత మొలకలకు ఎండ దగులనీయ కుండ కాపాడుచుండవలెను. మరియు మళ్ళు మిక్కిలి తేమగా గాని ఎండి పోయి గాని యుండ కూడదు. ఈ చెట్లను కొమ్మలు నాటి కూడ పెంచ వచ్చును. చెట్లకు పదునాలుగు సంవత్సరములు వచ్చి నప్పటికి నుండి రబ్బరుకై వానిని గీయ వచ్చును. చెట్ల మీద ఎనిమిది చోట్ల నేల వాలుగ నాట్లు పెట్టుదురు. ఈ నాట్లు మిక్కిలి లోతుగ నుండ కూడదు. పాలు బెరడునకు దగ్గరగానే యుండును. నాట్లు పెట్టుటకూ మంచి సాధనములు గలవు. ప్రతి నాటు క్రిందను ఒక కుండను కట్టుదురు. పాలు ఈ కుండ లోనికి దిగును. ఒక దినమాకుండ చెట్టు మీదస్నున్న పిదప దానిని దీసి, అందులోని పాలను శుభ్రపరచి కొంచెము పటిక నీళ్ళను చల్లుదురు. పాలు చిక్కబడి రబ్బరగును.
ఈరబ్బరుచెట్లు విస్తారముగ హిమాలయ పర్వతముల ప్రాంతములను అస్సాము దేశములోనుగలవు. రబ్బరు తో బళ్ళచక్రములు, బంతులు మొదలగు నెన్నియో సాధనము