ఈ పుట ఆమోదించబడ్డది

390

ఆకులు
- ఒంటరి చేరిక, లఘు పత్రములు, తొడిమ పెద్దది. కణుపు పుచ్ఛములు గలవు. అండాకారము, సమాంచలము, దట్టముగాను బిరుసుగాను నుండును.
పుష్ప్ మంజరి
- మఱ్ఱి చెట్టునకు బువ్వులు లేవను కొను చున్నారు గాని, ఆకుల వద్ద కాయల వలె అగుపించునవి పుష్పములే. ఒక కాయ వలెనగు పించునది ఒక పుష్పము గాని, ఒక కాయ గాదు. పనసకంకి మీద మిమ్మట్లే దానిలోను చాల పుష్పములున్నవి. ఈ సంగతి లేత వానిని తుంపి పి చూచిన తెలియగలదు. వృంతము కాడ వలె నుండ్క, గుండ్రమై బంతివలెనై పుష్పస్ముల నాన్నిటిని నావరించు చున్నది. ఒక్కచోట మాత్రమఒక రంద్రము గలదు. ఈ రంధ్రము యొద్ద కాడస్ల నంటికొన్ని గలవు. అవి గొడ్డులైన పుష్పములు. పురుష పుష్పములును స్త్రీ పుష్పములును అడుగుగా నున్నవి. ఇవి మిక్కిలిచిన్నవి.
పురుష పుష్పము
పుష్పనిచోళము. కింజల్కములు వీని రేకుల కెదురుగా నున్నవి. గాన నిది పుష్ప కోశము. రక్షక పత్రములు నాలుగు.
కింఝల్కములు ఒకటో రెండో యుండును. పుప్పొడి తిత్తులు రెండు గదులు.

స్త్రీ పుష్పములలో రెండు రకములున్నవి. కొన్నిటి కాడ (ఉప వృంతము) పొడుగుగను కీలము పొట్టిగను నున్నది. కొన్నిటికాడ పొట్టిగను కీలము పొడుగుగను నున్నది.

అండకోశము
ఒకగది అండముఒకటి. కీలాగ్రములావు.