ఈ పుట ఆమోదించబడ్డది

388

కొఱమాను చెట్టుకూడ కొండలమీద పెద్దగాపెరుగును. దీని పువ్వులందును బెంటింగి పువ్వులందువలె పచ్చని రేకులు గ్లవు. దీని కలప గట్టిగనే యుండును. ఆకులు పశువులు తినును.

డొంకిబూర కాలువల గట్లు మీద డొంకల మీద ప్రాకుచుండును.

నేపాళము పెక్కు చోట్ల చిన్నమొక్కగ పెరుగు చున్నది. దీని గింజల నుండి తీయు చమురు విరేచనములగుటకును డోకులు వచ్చుటకును, చర్మవ్యాధులకును పనికి వచ్చును. కాని గింజలనే తినినచో ప్రాణహానియు వాటిల్లును. కొన్ని చోట్ల దీని ఆకులను పట్టు పురుగులకు ఆహారముగ పెట్టుచున్నారు.


పనస కుటుంబము.


పనస చెట్లును చాలచోట్లనే పైరుచేయు చున్నారు.

ఆకులు ఒంటరిచేరిక, తొడిమ గలదు కణుపు పుచ్చములున్నవి. లఘు పత్రములు, అధశ్శిర అండాకారము. సమాచలము, విషమఖ పత్రము, పత్రము బిరుసుగా నుండును. శిరోదంతి ఆకులను త్రుంచిన పాలు గారును.