ఈ పుట ఆమోదించబడ్డది
376
గంధము రాయుచుందురు. వివాహాది శుభ కార్యములలోనీ చెక్కను వాడుదురు.
ఆముదపు కుటుంబము.
ఆముదపు చెట్టు 2 - 5 అడుగుల ఎత్తువరకు పెరుగును.
- ప్రకాండము
- - గుల్మము. కొయ్య వంటి దారు లేదు. లేత కొమ్మల మీదను, దొడిమల మీదను తెల్లని మెత్తని పదార్థము గలదు. అది లేగొమ్మలను ఎండకు ఎండి పోకుండ కాపాడును.
- ఆకులు.- ఒంటరి చేరిక. లఘు పత్రము. మొగ్గగా నున్నప్పుడు దానిని గప్పుచు 2 కణుపు పుచ్ఛములు గలవు. పత్రముతో దొడిమ చేరు చోట దీనికిరు పక్కల బత్రము మీద గ్రంధి గోళములు గలవు. తొడిమ పాత్రము యొక్క అంచుతో చేరక కొంచెము మధ్యగా కలియు చున్నది. తాళపత్ర వైఖరి 7, 8 తమ్మెలున్నవి. తమ్మెల అంచున రంపపు పండ్లు గలవు. కొన సన్నము. బహుకాష్టకము. రెండు వైపుల నున్నగా నుండును.
- పుష్పమంజరి
- - రెమ్మ గెల. ఏకలింగ పుష్స్పములు. ఒక కొమ్మమీదనే స్త్రే, పురుష పుష్పములు గలవు. వృంతమలడుగు భాగమున స్త్రీ పుష్పములు, పైభాగమున పురుష పుష్పములు.
- పురుష పుష్పము
పుష్ప కోశము. ( పుష్పనిచోళము) 3--5 రక్షక పత్రము ఒకదానినొకటి తాకుచుండును.
దళవలయము. లేదు.