ఈ పుట ఆమోదించబడ్డది

366

లింగ పుష్పములు. అండాశయమునందొక గదియు అందొక గింజయు వున్నవి.

జాజి చెట్టు ఒండ్రు మట్తి నేలలలో బాగుగ పెరుగును. వీనికి ఇసుక నేలలు పనికి రావు. శీతల ప్రదేశములును కూడవు. గింజలను పాతిననే మొక్కలు మొలచును. ఈ చిన్న మొక్కల కనుదినము నీరు పోయు చుండవలెను. అవి రెండు మూడడుగులు ఎత్తు పెరిగిన తరువాత తీసి 25 - 30 అడుగులదూరములో పాతవలెను. వీని కంతగా ఎండ తగులనీయ కూడదు. తరుచుగా నీరు పోయు చుండ వలెను. చెట్లు పెద్దవై పుష్పించుట కారంభింప గానే,అవి ఆడ చెట్లో పోటు చెట్లో తెలిసి కొని, పది పండ్రెండు ఆడచెట్లు కొక మగ చెట్తు చొప్పునవుంచి మిగిలిన మగ చెట్లను కొట్టి వేయవచ్చును. వీనిన్ ఉండి పుప్పొడి ఆడ చెట్లను సులభముగా చేరుటకీమగ చెట్లను గాలి వచ్చెడు మార్గమందుంచ వలెను. ఏడవ ఏడు నుండియు కాయలు కాయుటకారంభించి ఏబది ఏండ్ల వరకు కాయ చుండును. ఒక్కొకచెట్టు నుండి బాగుగ కాయలు గాచుచుండినపుడు 200 కాయల వరకు వచ్చును.

కాయలు రాలగనే ఏరి తొక్కవలచి నిప్పుపైబెట్టి కొంచము వెచ్చ బెట్టుదురు. తరువాతి పురుగులు బట్టకుండ వానిని కొంచెము సున్నముతో రాచెదరు.