ఈ పుట ఆమోదించబడ్డది

353 న్నియు చిన్నవే. వానికె మంచిరంగు గాని సువాసన గాని లేది. పువ్వులలోను దళ వలయము లేదు. కొన్ని ఏక లింగపుష్పములే. కింజల్కములు 5 గాని తక్కువ గాని యుండును. కొన్నిటిలో గొడ్దు కింజల్కములు కూడ గలవు. ఈ కింజల్కములు పుష్ననిచోళపు పత్రముల కెదురుగా నుండును. కొన్నిటిలో పుప్పొడి తిత్తులులొక్కొకకటియె; ముఖ్యముగా నీ భేదమును బట్టియె ఈ కుటుంబమును విభజించి యున్నారు. వీని ఫలములు పేటికా ఫలములు.

తోట కూర అకుకూరలలో ప్రధానమైనది. వీనిలో కొన్నిటి కాడ లెర్రగా నుండును. ఇదియే ఎర్రతోటకూర. కొన్నిటికాడలు 5, 6 అడుగులెత్తు కూడ పెరుగును. ఇది చౌకగ దొరుకుటచే కాబోలు కొందరు ధనికులు దీని కూరను హీనముగా చూతురు గాని, ఇది ఏ కాయకూరలకును తీసి పోదు. ఆహార పదార్థములలో ముఖ్యముగ వలసిన నత్రజనము ఆకులలోనే మెండుగ నుండును.

చిలకతోటకూర తోటకూర వలెనే యుండును. మొక్కలు చిన్నవి. ఆకులెక్కువ ముదురు రంగుగా నుండును. దీనిని కొందరుకూరవండుకొందురు.