ఈ పుట ఆమోదించబడ్డది

351

లవండరు నిచ్చెడు మొక్కకూడ ఈకుటుంబము లోనిదే గాని మన దేశములో పెరుగుటయే లేదు.

పుదీన
- తోటలయందు పెరుగు చిన్న మొక్క. కింజల్కములు దళవలయముల కంటే బొడుగుగా నుండును. ఆకులుకు కొంచము ఘాటు వాసన గలదు. ఈ ఆకును అరోగ్యకర మందురు.
పర్ణము
- అస్ఫుట దళ వంతము.


తోటకూర కుటుంబము.


తోట కూరను చాల చోట్లనే సేద్యము చేయుచున్నారు.

ప్రకాండము
- గుల్మము. నున్నగాను పొడుగుగా నుండును.
ఆకులు
- ఒంటరి చేరిక, లఘు పత్రములు. అండాకారము. సమాంచలము. రెండు వైపుల నున్నగా నుండును. విషమ రేఖ పత్రము. కొన గుండ్రము. తొడిమ పొడుగుగా నుండును.
పుష్ప మంజరి
- కణుపు సందులనుండి గాని, కొమ్మల చివరల నుండి గాని కలుగును. పువ్వులు ఆకు పచ్చగను, చిన్నవి గను నున్నవి. అసంపూర్ణ ఏకలింగ పుష్పములు.
పుష్పవిచోళము
- అసంయుక్తము. 3 దళములు సన్నముగానున్నవి. నీచము.
పురుష పుష్పము
- కింజల్కములు 5. అయిదు కంటె తక్కువ కూడకలుగు చుండును. పుప్పొడి తిత్తులు రెండుగదులు.